1971 యుద్ధ సమయంలో భారత్ బంగ్లాదేశీయులకు సహాయం చేయలేదని, కేవలం పాకిస్థాన్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర...

1971 యుద్ధ సమయంలో భారత్ బంగ్లాదేశీయులకు సహాయం చేయలేదని, కేవలం పాకిస్థాన్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఆరోపించారు. ఆ సమయంలో భారత్ తన స్వప్రయోజనాల కోసమే పాకిస్థాన్‌పై యుద్ధం చేసిందని ఆమె పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న సమయంలో బుధవారం ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ భారత్‌కు కాలనీలా మారిందని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్, పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవస్థల మధ్య పోలికలు తెచ్చిన ఆయన, 1975లో బంగ్లాదేశ్ ఏకపక్ష పార్టీ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అయితే ఫిబ్రవరి 2026లో జరగనున్న సాధారణ ఎన్నికలు మాత్రం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
కాగా, గతంలో పాకిస్థాన్ సైన్యంలో మాజీ కెప్టెన్‌గా పనిచేసిన హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. డిసెంబర్ 2025లో ప్రొథోమ్ అలో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత్ అందించిన సైనిక సహాయాన్ని కొనియాడారు. సిల్హెట్ విమోచన పోరాటంలో భారత మేజర్ సహకారంతో పాటు భారతీయ వాయుసేన అందించిన మిగ్ విమానాల దాడులను ఆయన గుర్తుచేసుకున్నారు.