బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. ఫిబ్రవరి ఎన్నికల అనంతరం బీఎన్‌పీ అధికారంలోకి వచ్చినప్పటికీ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగానే మిగ...

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. ఫిబ్రవరి ఎన్నికల అనంతరం బీఎన్‌పీ అధికారంలోకి వచ్చినప్పటికీ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగానే మిగిలింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు 10 నెలల కాలంలో దేశవ్యాప్తంగా మతపరమైన, జాతిపరమైన మైనారిటీలపై 1,445 దాడులు జరిగినట్లు 'హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనారిటీస్' (హెచ్‌ఆర్‌సీబీఎం) నివేదిక వెల్లడించింది.
ఈ పది నెలల్లో నమోదైన ఘటనల్లో 286 హత్యలు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని హెచ్‌ఆర్‌సీబీఎం పేర్కొంది. అలాగే 407 అపహరణలు, భౌతిక దాడులు, 63 లైంగిక హింస కేసులు, ఆలయాలు మరియు మతపరమైన ప్రదేశాలపై 251 దాడులు జరిగాయి. ఆస్తులపై దాడులు, భూకబ్జాలు, దహనాలు, లూటీలకు సంబంధించి మరో 408 ఘటనలు నమోదయ్యాయి.
దుర్గాపూజ సమీపిస్తున్న వేళ పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. తంగైల్ జిల్లా మీర్జాపూర్‌లోని జముర్కీ గ్రామంలో 87 ఏళ్లుగా పూజలు నిర్వహిస్తున్న ఆర్య సమితి దుర్గా ఆలయంలో అక్టోబర్ 1 ఉదయం దుర్గా విగ్రహంతో సహా ఏడు విగ్రహాలు ధ్వంసమైనట్లు గుర్తించారు. అలాగే కుష్టియాలోని ఖాయెర్‌చరా సార్వజనీన్ మాతృమందిర్‌లో అక్టోబర్‌లో నాలుగు దుర్గా విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
బోగురాలోని కాంచాగారిలో జూన్ నెలలో మూడు హిందూ ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు. సునామ్‌గంజ్‌లో 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక కుటుంబ ఆలయం నుంచి మూడు విగ్రహాలు, పూజా సామగ్రి చోరీకి గురయ్యాయి. నోవాఖాలీ జిల్లా హతియాలో రైతు మృదుల్ బాబు నివాసంపై ఎన్నికల సమయంలో దాడి జరిగింది. బాధితులకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేకపోయినా దాడి జరగ్గా, నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వ పరిహారం అందక అప్పులు చేసి ఇంటిని పునర్నిర్మించుకున్నారు.