భారత్- పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము కలుగజేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. భారత్-పాక్ వివ...
భారత్- పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము కలుగజేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. భారత్-పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదని, అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ప్రోత్సహిస్తున్నారని, తాము చేయగలిగేది పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ప్రోత్సహించడమేనని తెలిపారు.
కానీ, తాము యుధ్యంలో పాల్గొనబోమని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. “భారతీయులను యుద్ధం ఆపమని అమెరికా చెప్పలేదు. అలాగే పాకిస్తానీలను యుద్ధం ఆపమని కూడా చెప్పలేదు. ఈ యుద్ధం తీవ్రతరమై మరింత పెద్ద యుద్ధంగా, అణుయుద్ధంగా మారకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి రాదని మేము అనుకుంటున్నాము” అని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, పాక్ యుద్ధంపై స్పందిస్తూ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ గురించి తనకు బాగా తెలుసునని, ఆ రెండు దేశాలు సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఉటంకిస్తూ వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటుందని వాన్స్ చెప్పారు. భారత్‌కు పాకిస్తాన్‌తో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఉద్రిక్తతలను తగ్గించమని రెండు దేశాలను ప్రోత్సహించగలమని, అయితే తాము మధ్యలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
అయితే, రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం అణు యుద్ధంగా మారొచ్చని వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరిగితే ఖచ్చితంగా వినాశకరమైందని హెచ్చరించారు. ఈ పరిస్థితి రావొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయం చేస్తానని ప్రకటించారు. సహాయం చేయడానికి తాను ఏదైనా చేయగలిగితే, అంతకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఆపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మరోవంక, భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే కచ్చితంగా భారత్ గెలుస్తుందని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ మాజీ పైలట్ డేల్ స్టార్క్ తెలిపారు. భారత్, పాక్ పైలట్లు ఇద్దరితోనూ తాను గతంలో కలిసి పనిచేశాని చెబుతూ యుద్ధ పరిస్థితి ముదిరితే మాత్రం భారత్‌కే విజయం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.