Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆవిరి పడితే నిజంగానే కోవిడ్-19 తగ్గుతుందా? - Vandebharath

కరోనా వేళ స్టీమ్ ఇన్‌హేలర్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. కోవిడ్ తగ్గుతుందని నమ్మి.. చాలా మంది వీటిని వాడుతున్నారు. మరి ఆవిరిపడితే నిజంగానే కరో...


కరోనా వేళ స్టీమ్ ఇన్‌హేలర్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. కోవిడ్ తగ్గుతుందని నమ్మి.. చాలా మంది వీటిని వాడుతున్నారు. మరి ఆవిరిపడితే నిజంగానే కరోనా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అయితే వచ్చింది గానీ.. పూర్తి స్థాయిలో మందు మాత్రం రాలేదు. రెమ్‌డెసివిర్ వంటి పలు యాంటి వైరల్ డ్రగ్స్‌నే వినియోగిస్తున్నారు. వీటికి తోడు సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా ఖతమ్.. అలా చేస్తే కోవిడ్ ఫసక్.. అంటూ వార్తలు కనిపిస్తున్నాయి. వంటింటి చిట్కాలతో కరోనాను దూరం చేయవచ్చు.. ఈ కషాయం తాగితే కోవిడ్ దరిచేరదు..అంటూ ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి. ఆవిరి పడితే కరోనా తగ్గుతుందన్నది కూడా అందులో ఒకటి. ఈ ప్రచారంతోనే స్టీమ్ ఇన్‌హేలర్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది వీటిని వాడుతున్నారు. మరి ఆవిరిపడితే నిజంగానే కరోనా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

కరోనా వైరస్ గొంతులో ఉంటే వేడి నీళ్లు తాగితే తగ్గిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పారానాసల్ సైనస్ తగ్గర ఉంటే మాత్రం వేడి నీళ్లు తాగినా ప్రయోనం ఉండదని.. ఆవిరి పడితే కరోనా వైరస్ చనిపోతుందని కుప్ప తెప్పలుగా వాట్సప్ సందేశాలు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దాని ప్రకారం.. కరోనా వైరస్ పారానాసల్ సైనస్ వద్ద మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులకు చేరుతుంది. అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కల్గుతాయి. అందుకే ఊపిరితిత్తులోకి వెళ్లేకంటే ముందే పారానాసల్ సైనస్‌లోనే దానిని చంపేయాలి. అందుకోసం ఆవిరిపట్టాలని అని ప్రచారం జరుగుతోంది. 60 డిగ్రీల వద్ద వైరస్ బలహీనపడుతుందని.. 70డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చనిపోతుందని కొందరు చెబుతున్నారు. అందుకే వారంలో కనీసం నాలుగు సార్లు ఆవిరి పడితే వైరస్ మరణిస్తుందని అంటున్నారు. కానీ ఇందులో నిజం లేదని వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

కరోనా చికిత్సలో ఆవిరి పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఆవిరి పట్టడం వల్ల కరోనా తగ్గుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు మాత్రమే తొలగిపోతాయని తెలిపారు. ఆవిరి పడితే కొంత రిలీఫ్ మాత్రం దొరుకుతుందని.. కానీ కరోనా ఇన్‌ఫెక్షన్ తగ్గదని చెప్పారు. ఎక్కువ వేడిగా ఉంటే ఆవిరి తీసుకుంటే శ్వాస నాళం దెబ్బతినే ప్రమాదముందని వెల్లడించారు. ఇది చాలా డేంజర్ అని హెచ్చరించారు.

అంతేకాదు గిన్నెలో వేడి నీళ్లు ఉంచి.. టవల్‌తో కప్పుకొని.. ముఖం దగ్గరగా పెట్టడం వల్ల.. చర్మం కాలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్తను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఏం చేసినా డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే చేయాలని చెబుతున్నారు.