Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నావికాదళం లో చేరనున్న ఐఎన్ఎస్ "కరంజ్ జలాంతర్గామి" - Vandebharath

  భారతదేశంలో నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఈ నెలలో అధికారికంగా నావికాదళంలో చేరనుంది.  ఐఎన్ఎస్ కరంజ్ ప్రయాణం మార్చి 10 న ముంబై నుంచి ప...

 


భారతదేశంలో నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఈ నెలలో అధికారికంగా నావికాదళంలో చేరనుంది.  ఐఎన్ఎస్ కరంజ్ ప్రయాణం మార్చి 10 న ముంబై నుంచి ప్రారంభం కానుంది.

ఈ  జలాంతర్గామిని ఫ్రెంచ్ కంపెనీ సహకారంతో మజాగాన్ డాక్ లిమిటెడ్ (ఎండిఎల్) నిర్మించింది.  భారత నావికాదళానికి చెందిన రెండు జలాంతర్గాములు, ఐఎన్ఎస్ కల్వరి మరియు ఐఎన్ఎస్ ఖండేరిలను మజాగాన్ నిర్మించింది.

 మూడేళ్ల సముద్ర శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఐఎన్‌ఎస్ కరంజ్‌ను నేవీకి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం ఆరు జలాంతర్గాములను మజాగాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించ నున్నారు.ప్రాజెక్ట్ -75 ఇండియా కింద ఆరు పెద్ద, సామర్థ్యం గల జలాంతర్గాములను నిర్మించాలని భారత్ నిర్ణయించింది.