Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రామ మందిర నిర్మాణం భారీగా విరాళాలు 2వేల 100 కోట్లు - Vandebharath

  అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లలో దాదాపు మొదటి ఘట్టం పూర్తి అయింది. దేశవ్యాప్తంగా నిధుల కోసం ప్రచారం చ...

 


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లలో దాదాపు మొదటి ఘట్టం పూర్తి అయింది. దేశవ్యాప్తంగా నిధుల కోసం ప్రచారం చేశారు. ఊహించనంత రీతిలో భారీగా విరాళాలు వచ్చాయి. దాదాపు 2వేల 100 కోట్లు వచ్చినట్లు శనివారం ట్రస్టు చెప్పింది.

విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో గతేడాది సంక్రాంతి నుంచి నిధుల సేకరణ మొదలైంది. ఇదంతా మరపురాని, మనసులో నిలిచిపోయే క్షణాలు అని వీహెచ్‌పీ వెల్లడించింది.

వీహెచ్పీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార నేషనల్ కన్వీనర్ అడ్వకేట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆదివారం ప్రపంచంలోనే భారీ ఎత్తులో జరిగిన ప్రచారం ఇది. ఇందులో 40లక్షల మంది కార్యకర్తలు, పది లక్షల టీంలు పాల్గొని రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు, జిల్లాలు, గ్రామాల్లో ప్రతి గడపకు తిరిగి నిధులు సమీకరించారు.

ఇది లాంచ్ చేసినప్పుడు గరిష్ఠంగా రూ.11వందల కోట్లు వస్తాయని ఆశించారు. కానీ, ఊహించనిరీతిలో పబ్లిక్ ఇందులో పార్టిసిపేట్ చేసి నిధుల సమీకరించారు.

లక్షల గ్రామాల్లో ఉన్న కోట్ల హిందూ కుటుంబాలు ప్రేమ, ఆప్యాయతతో ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఈ డ్రైవ్ లో చాలా మంది భావోద్వేగమైన క్షణాలు, పరిస్థితులు, తాహత్తుకు మించి చేసిన విరాళాలు ఇవ్వడం చూశాం’ అని అలోక్ కుమార్.