Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎయిర్‌టెల్‌ - Vandebharath

  న్యూఢిల్లీ:  టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటనల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ యాడ్స్‌ను ప్రారంభించింది. అభివృద్...

 

న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటనల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ యాడ్స్‌ను ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న భారతీయ ప్రకటనల పరిశ్రమలో పట్టు సాధించడానికి ఎయిర్‌టెల్‌ చేస్తున్న ప్రయత్నమని కంపెనీ తెలిపింది. కంపెనీ డేటా సైన్స్‌ సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. కాన్సెంట్‌ బేస్డ్, ప్రైవసీ సేఫ్‌ క్యాంపెయిన్‌ అందించేందుకు బ్రాండ్లకు అనుమతిస్తుంది. ఇది కేవలం తమ కస్టమర్లకు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ల ప్రకటనలను మాత్రమే అందిస్తుందని, అవాంచిత స్పామ్‌లను కాదని భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌ ఆదర్శ్‌ నాయర్‌ తెలిపారు.

తాము క్వాంటిటీ కోసం కాక క్వాలిటీకి  ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రకటనల వ్యాల్యూమ్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కస్టమర్ల ప్రాధాన్యత, బ్రాండ్ల మధ్య సంబంధాలను ఏర్పరుచుకోవాలని కంపెనీ చూస్తుందని.. అంతేగానీ అర్థవంతం కానీ ప్రకటనలతో కస్టమర్లను కోల్పోదని లేదా వినియోగదారుల ప్రొఫైల్స్‌ను కోల్పోమని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం మొబైల్, డీటీహెచ్, హోమ్స్‌ వంటి వివిధ వ్యాపారాలకు సంబంధించి 320 మిలియన్ల మంది వినియోగదారులున్నారు.  

రిటైల్‌ స్టోర్లలో డిజిటల్‌ యాడ్స్‌.. 
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రిటైల్, స్టోర్లున్నాయి. డిజిటల్‌ అవగాహన లేని వినియోగదారుల కోసం ఆయా ప్రాంతాలలో హెల్త్‌ కవరేజ్, వీడియో సబ్‌స్క్రిప్షన్‌ వంటి ప్రకటనలు ఏమైనా చేయగలమా? లేదా? అనే టెస్టింగ్స్‌ జరుగుతున్నాయని.. త్వరలోనే రిటైల్, స్టోర్లలో ఈ ప్రకటనల యూనిట్లు కనిపించే అవకాశముందని నాయర్‌ తెలిపారు. పెప్సికో, జొమాటో, క్రెడ్, టాటా ఏఐజీ, అపోలో, లెన్స్‌కార్ట్, కార్స్‌24, గేమ్స్‌క్రాఫ్ట్, హార్లీడేవిడ్‌సన్‌ వంటి సుమారు వంద  బ్రాండ్ల ప్రచారాలు బీటా దశలో కొనసాగుతున్నాయి.