న్యూయార్క్: స్టాక్ మార్కెట్లో వేల కోట్లు సంపాదించిన అమెరికా బిలియనీర్ వారెన్ బఫెట్.. రుణ పత్రాల (బాండ్స్) మార్కెట్‌పై అంతగా ఆసక్తి...
న్యూయార్క్: స్టాక్ మార్కెట్లో వేల కోట్లు సంపాదించిన అమెరికా బిలియనీర్ వారెన్ బఫెట్.. రుణ పత్రాల (బాండ్స్) మార్కెట్‌పై అంతగా ఆసక్తి చూపించటం లేదు. వడ్డీ రేట్లు పాతాళానికి పడిపోయిన ప్రస్తుత తరుణంలో వీటిలో పెట్టుబడులు ఏ మాత్రం లాభదాయకం కాదని తేల్చేశారు. తన నిర్వహణలోని బెర్క్‌షైర్ కంపెనీ వాటాదారులకు ఏటా రాసే లేఖలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. అమెరికాలో గత ఇరవై ఏళ్లలో పడిపోయిన వడ్డీ రేట్లను బఫెట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.1981 సెప్టెంబరులో పదేళ్ల కాల పరిమితి ఉండే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై 15.8 శాతం ఉన్న వడ్డీ రేటు, గత ఏడాది డిసెంబరు చివరికి 0.93 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్‌లో కూడా వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపించడం లేదన్నారు. అయితే బెర్క్‌షైర్ వాటాదారులకు మాత్రం భవిష్యత్‌లోనూ మంచి రాబడులకు ఢోకా ఉండకపోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ !
అమెరికా మరో ఆర్థిక ‘ఉద్దీపన’కు సిద్ధమవుతోంది. అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించిన 1.9 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ఇది అదనమని తెలుస్తోంది. ఈ సారి ప్రకటించబోయే ప్యాకేజీ రెండు లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.148 లక్షల కోట్లు) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.