తిరువనంతపురం: కేరళ హైకోర్టు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర బీజేపీలో చేరారు. ఈయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో బీజేపీలో చేర...
తిరువనంతపురం: కేరళ హైకోర్టు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర బీజేపీలో చేరారు. ఈయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనికి ముందు ఫిబ్రవరి 25న మోట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరారు. కేరళ రాజకీయాలకు సంబంధించి బీజేపీలో శ్రీధరన్ చేరడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర చేరిక రాష్ట్ర బీజేపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.