Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రాహుల్‌ గాంధీ : గది మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది - Vandebharath

  న్యూఢిల్లీ :  తజకిస్తాన్‌లో​ శుక్రవారం రాత్రి సంభవించిన భూప్రకంపనలు ఉత్తర భారత్‌ను వణికించాయి. జమ్మూ కశ్మీర్‌తో పాటు రాజధాని ఢిల్లీలోనూ పల...

 


న్యూఢిల్లీ : తజకిస్తాన్‌లో​ శుక్రవారం రాత్రి సంభవించిన భూప్రకంపనలు ఉత్తర భారత్‌ను వణికించాయి. జమ్మూ కశ్మీర్‌తో పాటు రాజధాని ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం రోడ్ల మీదకు పరుగులు తీశారు. కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం భూప్రకంపనలపై స్పందించారు. రాత్రి సమయంలో తాను ఓ వీడియో కాల్‌ మాట్లాతుండగా.. తన గది మొత్తం ఒక్కసారిగా ఊగిపోయిందని తెలిపారు.