సామాన్యులు మొదలు.. దేశాధినేతల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ మీడియా సంస్థలు. అయి...
సామాన్యులు మొదలు.. దేశాధినేతల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ మీడియా సంస్థలు. అయితే, అవే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం లు.. ఎంతో మందికి క్రేజ్ తీసుకువచ్చాయి. ఇదిలాఉంటే.. దేశాధినేతలంటే సహజంగానే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అది సోషల్ మీడియాలో అయితే ఇంకాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే, ప్రముఖులు మాత్రం చాలా కొద్ది మందిని మాత్రమే ఫాలో అవుతుంటారు. ప్రధానంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధికారిక ట్విట్టర్@POTUS ద్వారా కేవలం 13 మందిని ఫాలో అవుతున్నారు. వీరిలోనూ అత్యంత ప్రముఖులు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, ఇతర వ్యక్తులు ఉన్నారు. అయితే, ఈ 13 మందిలో ఓ నటి కూడా ఉండటం విశేషం. ఆమె అమెరికన్ టెలివిజన్ స్టార్, మోడల్ క్రిస్సీ టైగెన్.
అయితే, తొలుత ఆమె అభ్యర్థన మేరకే బైడెన్ క్రిస్సీని ఫాలో అవుతుండగా.. మళ్లీ ఆమె అభ్యర్థనమే అన్‌ఫాలో చేశారు బైడెన్. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకిళితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రిస్సీ గతంలో నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విపరీతమైన విమర్శలు చేసింది. దాంతో ట్రంప్ ఆమె ఖాతాను బ్లాక్ చేశారు. తాజాగా కొత్త అధ్యక్షుడుగా బైడెన్ రావడంతో క్రిస్సీ.. తనను ఫాలో అవ్వాలంటూ పలుమార్లు @POTUS కోరింది. ఆ మేరకు ట్వీట్లు చేసింది. క్రిస్సీ అభ్యర్థనను మన్నించిన బైడెన్.. ఆమెను ఫాలో చేశారు. అయితే, ఏమైందో తెలియదు కానీ.. తాజాగా తనను అన్‌ఫాలో చేయండంటూ మళ్లీ అభ్యర్థిస్తూ ట్వీట్ చేసింది. ‘నాకు నాలా గుర్తింపు దక్కాలంటే మీరు నన్ను అనుసరించొద్దు అని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. అది చూసిన బైడెన్ క్రిస్సీని అన్‌ఫాలో చేశారు. దాంతో ప్రస్తుతం @POTUS ఫాలో అవుతున్న వారి సంఖ్య 12 ఉంది. అయితే, క్రిస్సీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముందుగా ఫాలో అవమని కోరడం.. మళ్లీ తానే అన్‌ఫాలో కొట్టాలని కోరడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తు్న్నారు.