Page Nav

HIDE

Grid

GRID_STYLE
Sunday, May 25

Pages

బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డ వి. హనుమంతరావు.. Vandebharath

  Congress Leader:  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కార్ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మరొసారి ఫైర్ అయ్యారు. ...

 



Congress Leader: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కార్ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మరొసారి ఫైర్ అయ్యారు. ఒక సచివాలయం తప్ప దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులను అమ్మేసేలా ఉందంటూ బీజేపీ తీరును తూర్పారబట్టారు. ఇదే సమయంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే బొంద పెడతావా? అంటూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. గురువారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో మాట్లాడారని విమర్శించారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారమే రాష్ట్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్న ౠయన.. తెలంగాణను కూడా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని బొందపెడతా.. కాళ్లకింద నలిపేస్తా అని సీఎం కేసీఆర్ అనడం పద్ధతి కాదన్నారు. సీఎం కుర్చీలో కేసీఆర్ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుచెప్పారు. ప్రజల నిర్ణయం మేరకు అధికారం ఉంటుందని గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నారని, మరి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని వీహెచ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో బీజేపీపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మార్పు తెస్తారని అధికారం కట్టబెడితే.. ఉన్నవన్నీ అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.