Attack on Man: గుంటూరు జిల్లా కేంద్రంలోని లాలాపేట గంటలమ్మ చెట్టు వీధిలో ఉద్రిక్తత నెలకొంది. మసీద్ సెంటర్ వద్ద రౌడీ షీటర్, మరో నలుగురు వ్...
Attack on Man: గుంటూరు జిల్లా కేంద్రంలోని లాలాపేట గంటలమ్మ చెట్టు వీధిలో ఉద్రిక్తత నెలకొంది. మసీద్ సెంటర్ వద్ద రౌడీ షీటర్, మరో నలుగురు వ్యక్తులు హల్ చల్ చేశారు. మొహమ్మద్ రయాన్ అనే బంగారం వ్యాపారిపై కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొహమ్మద్ రయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం.. మొహమ్మద్ రయాన్ బంగారం వ్యాపారం నిర్వహిస్తుంటాడు. తద్వారా అతను మరికొందరికి కూడా ఉపాధి కల్పిస్తుంటాడు. అయితే స్థానికులైన తమకు కాకుండా బయటి వ్యక్తులకు బంగారం పని ఇస్తున్నాడనే కోపంతో ఇమ్రాన్ అతనిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో రయాన్‌పై దాడి చేసేందుకు రౌడీ షీటర్ మున్నాతో చేతులు కలిపాడు. అతనితో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. మున్నా, జాకీర్, ఆరిఫ్, హుస్సేన్‌తో కలిసి రయాన్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డాడు ఇమ్రాన్. ఈ దాడిలో రయాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న రయాన్‌ను స్థానికులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రయాన్‌పై దాడికి పాల్పడిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.