ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాక మునిసిపల్ ఎన్నికల దాకా పాకింది. ఇంకో వైపు అనూహ్యంగా ముందుకు వచ్చిన విశ...
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాక మునిసిపల్ ఎన్నికల దాకా పాకింది. ఇంకో వైపు అనూహ్యంగా ముందుకు వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం ఇపుడు అగ్గి రాజేస్తోంది.
ఇదిలా ఉంటే విశాఖలో వైసీపీకి సర్వం సహా అయిన విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద ఎపుడూ కామెంట్స్ చేస్తూ చెడుగుడు ఆడతారు. ఇతర నాయకులు సాయిరెడ్డి మీద తిరిగి విమర్శలు చేస్తారు తప్ప బాబు మాత్రం ఆయన్ని డైరెక్ట్ గా ఏనాడు కామెంట్ చేయలేదు. కానీ విశాఖ టూర్ లో మాత్రం సడెన్ గా విజయసాయిరెడ్డి మీద చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాదు, విజయసాయిరెడ్డి ఇంతకాలం తన మీద చేస్తున్న విమర్శలకు ఇలా గట్టి షాక్ ఇచ్చేశారు. ఇంతకీ విజయసాయిరెడ్డి మీద చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏంటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏం చేశారు అంటూ నిలదీశారు. ప్లాంట్ విషయంలో పోరాటం ఢిల్లీలో చేయాల్సి ఉండగా గల్లీలో మాటలెందుకంటూ గట్టిగానే కౌంటర్లేశారు.
ఇక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాదయాత్ర అంటూ వీజయసాయిరెడ్డి ప్రకటించడాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ పాదయాత్ర దేనికీ, ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్ళి మాట్లాడాలి కానీ అంటూ సెటైర్లు వేశారు. ఒకవేళ పోరాటం చేయకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇంట్లో గమ్మున ఉండాలని కూడా బాబు గట్టిగానే చురకలేశారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని ఏటూ అని సంభోదిస్తూ చంద్రబాబు చేసిన కామెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. విశాఖ రాజకీయాలలో కీలకంగా మారిన సాయిరెడ్డిని బాబు టార్గెట్ చేయడం వెనక భారీ పొలిటికల్ స్కెచ్ ఉందని అంటున్నారు. మరి రానున్న రోజులలో ఇంకెన్ని బాంబులు బాబు పేలుస్తారో అని కూడా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.