Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

'పంత్‌ వీర బాదుడు' - Vandebharath

  చెన్నై:   మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ చితక్కొట్టిన తర్వాత మళ్లీ క్రికెట్‌ ఆడగలనో లేదో అని సందేహించాన...

 


చెన్నై: మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ చితక్కొట్టిన తర్వాత మళ్లీ క్రికెట్‌ ఆడగలనో లేదో అని సందేహించానని ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ అన్నాడు. ముఖ్యంగా పంత్‌ అతని బౌలింగ్‌లోనే ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. లీచ్‌ బౌలింగ్‌లోనే మరో పది ఫోర్లు కూడా రాగా, మ్యాచ్‌ మూడో రోజు ఒక దశలో 8 ఓవర్ల వ్యవధిలో అతను ఏకంగా 77 పరుగులు సమరి్పంచుకున్నాడు.

‘భారత్‌లో ఇది నా మొదటి సిరీస్‌. కానీ చాలా కఠినంగా ప్రారంభమైంది. భారత జట్టు  మెరుపు బ్యాటింగ్‌ దెబ్బకు నా పరిస్థితి అంతా తలకిందులుగా మారిపోయింది. ఇక నేను మళ్లీ క్రికెట్‌ ఆడలేనని అనిపించింది. అయితే ఆ తర్వాత కోలుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చాలా ఆనందం కలిగించింది. అయినా 227 పరుగులతో గెలిచిన తర్వాత ఏ బాధ అయినా మటుమాయం కావాల్సిందే. మ్యాచ్‌లో ఎన్నో రకాల భావోద్వేగాల అనంతరం గెలుపు రుచి చూశాను. అదే క్రికెట్‌ గొప్పతనమంటే’ అని లీచ్‌ అన్నాడు.