దిల్లీ: దేశ రాజధాని దిల్లీ ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని హరికేశ్ నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కార్మికుల కోసం వేసిన దాదాపు 20 గూడారాలు మం...
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ ఓక్లా పారిశ్రామిక ప్రాంతంలోని హరికేశ్ నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కార్మికుల కోసం వేసిన దాదాపు 20 గూడారాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అక్కడే నిలిపి ఉంచిన ఓ ట్రక్కు దగ్ధమైంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆస్తినష్టం మాత్రం భారీ స్థాయిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.