Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. Vandebharath

  ముంబయి :  మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా యావల్‌ తాలూకాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందా...


 

ముంబయి : మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా యావల్‌ తాలూకాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. యావల్‌ తాలూకాలోని కింగ్వాన్‌ సమీపంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. బొప్పాయి పంటను మార్కెట్‌కు తరలిస్తుండగా, వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్‌ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.