నెపితా: మయన్మార్ సైన్యానికి సంబంధించిన అన్ని అకౌంట్లను బ్యాన్ చేసినట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్లడించింది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళ...
నెపితా: మయన్మార్ సైన్యానికి సంబంధించిన అన్ని అకౌంట్లను బ్యాన్ చేసినట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్లడించింది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిపై జరుగుతున్న అణిచివేతను ఫేస్‌బుక్ ఖండించింది. ఈ నేపథ్యంలో మిలిటరీతో పాటు సైనిక అనుబంధ అకౌంట్లు అన్నింటినీ బ్యాన్ చేసినట్లు ఎఫ్‌బీ చెప్పింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో సైనిక అకౌంట్లను బ్లాక్ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన సైన్యం తిరుగుబాటు చేసి మయన్మార్ ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మయన్మార్ సైన్యాన్ని తత్మదా అని పిలుస్తారు. తత్మదాను ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో అనుమతించడం ప్రమాదకరమే అవుతుందని ఎఫ్‌బీ అభిప్రాయపడింది. రాజకీయ నేతలకు మళ్లీ అధికారం ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఆ నిరసనకారులను అత్యంత దారుణంగా మయన్మార్ సైన్యం అణిచివేస్తున్నది. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న వారిలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంను దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతోనే మయన్మార్ సైనిక అకౌంట్లను బ్యాన్ చేసినట్లు ఫేస్‌బుక్ చెప్పింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో భారీ మోసం జరిగినట్లు సైన్యం తన ఫేస్‌బుక్‌లో విపరీత ప్రచారం చేసింది.