Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

సౌదీ మహిళలు సైన్యంలో చేరొచ్చు! - Vandebharath

  రియాద్‌: ఆయిల్ రిచ్ సౌదీ అరేబియా మహిళలు సైన్యంలో చేరేందుకు అనుమతినిచ్చింది. దీంతో సౌదీ మహిళలు సైనికులుగా, లాన్స్ కార్పొరల్స్‌గా, కార్పొరల్...

 

రియాద్‌: ఆయిల్ రిచ్ సౌదీ అరేబియా మహిళలు సైన్యంలో చేరేందుకు అనుమతినిచ్చింది. దీంతో సౌదీ మహిళలు సైనికులుగా, లాన్స్ కార్పొరల్స్‌గా, కార్పొరల్స్‌గా, సార్జెంట్లుగా చేరొచ్చు. రెండేండ్ల క్రితమే మిలిటరీలో మహిళలను చేరేందుకు ప్రణాళిక రూపొందించిన సౌదీ అరేబియా ప్రభుత్వం.. 2018లో మహిళలు సొంతంగా వాహనాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. సౌదీ అరేబియాలో మహిళలపై ఉన్న ఆంక్షలను క్రమంగా తొలగిస్తూ వస్తున్నది. మహిళలపై ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ హక్కుల కార్యకర్తలు విస్త్రుత స్థాయిలో ఆందోళనలు చేయడం కూడా దీనికి కారణం.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. 2030 నాటికి దేశీయ ఆర్థిక వ్యవస్థను 90 బిలియన్ల డాలర్ల స్థాయికి పెంచాలని సౌదీ సర్కార్ భావిస్తున్నదని బ్లూమ్‌బర్గ్ సర్వేలో తేలింది. మాల్స్‌లో క్యాషియర్లుగా, హోటళ్లు లేదా రెస్టారెంట్లలో వెయిటర్లుగా మహిళలు పని చేయడానికి అనుమతించారు. తర్వాత పురుష బంధువుల్లేకుండా మహిళలు దేశాన్ని వీడేందుకు కూడా సౌదీ అరేబియా సర్కార్ వెసులుబాటు కల్పించింది.

గతేడాది సౌదీ అరేబియా న్యాయశాఖ మంత్రి 100 మంది మహిళలు పబ్లిక్ నోటరీలుగా అప్పాయింట్ చేశారు. త్వరలో మహిళా న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ మంత్రి ప్రకటించారు. మహిళలు పని చేయడానికే పరిమితమైన అవకాశాలను ఎత్తివేస్తూ ఇటీవలే చట్టంలో మార్పులు తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సౌదీ సర్కార్‌.. మహిళలను అనుమతించింది.