మదనపల్లె(చిత్తూరు): చిత్తూరుజిల్లా మదనెపల్లికి ఆదివారం విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఎపి ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. ఆ...
మదనపల్లె(చిత్తూరు): చిత్తూరుజిల్లా మదనెపల్లికి ఆదివారం విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఎపి ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. ఆదివారం ఉ. 11.56 గం.లకు ప్రత్యేక వైమానికదళ హెలికాప్టర్‌లో చిప్పిలికి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్- గ్రామీణాభివఅద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట, చిత్తూరు ఎంపిలు మిథున్ రెడ్డి, ఎన్. రెడ్డెప్పలు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి, పలమనేరు ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారాకనాథ రెడ్డి, వెంకటగౌడ్‌లు, అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా, కలెక్టర్ ఎం. హరినారాయణన్, ఎస్‌పి సెంథిల్‌కుమార్, మదనపల్లె సబ్‌కలెక్టర్ ఎం. జాహ్నవి లు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన సత్సంగ్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి వెళ్లారు.