Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కంచి కామకోటి పీఠాధిపతికి అవమానం.. Vandebharath

  కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి అవమానం జరిగింది. చెన్నైరామేశ్వరంలోని రామనాధస్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయం బైటే వే...

 


కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి అవమానం జరిగింది. చెన్నైరామేశ్వరంలోని రామనాధస్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయం బైటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ అధికారులపై విజయేంద్ర సరస్వతి అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామనాధస్వామి వారి దర్శనం కోసం వెళ్లిన విజయేంద్ర సరస్వతిని ఆలయ అధికారులు ద్వారం వద్దే నిలిపి వేశారు. గర్భాలయంలో ప్రముఖులు ఉన్నారంటూ ఆలయ సిబ్బంది ఆయనను బయటే నిలిపివేశారు. దీంతో
విజయేంద్ర స్వరస్వతి అనుచరులు ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గంటకు పైగా బయటే వేచి ఉన్నారు విజయేంద్ర స్వరస్వతి.

ఆలయంలో నెలకొన్న వివాదంపై మంత్రి ఓ.ఎస్ మణియన్ రంగప్రవేశం చేశారు. ఆలయానికి చేరుకుని విజయేంద్ర సరస్వతికి మంత్రి క్షమాపణ చెప్పారు. అనంతరం దీపారాధన చేసి విజయేంద్ర సరస్వతి వెళ్లిపోయారు. అయితే అధికారుల తీరుపై భక్తులు మండిపడ్డారు.