మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి 3వేల నుంచి నాలుగు వేలకు పైగా నమోదువుతున్న కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప...
మహారాష్ట్రలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి 3వేల నుంచి నాలుగు వేలకు పైగా నమోదువుతున్న కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అమరావతిలో లాక్‌డౌన్‌ను విధిస్తూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నమోదైన కేసులు మళ్లీ భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 75 రోజుల అనంతరం మళ్లీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది.
బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,427 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారితో 38 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,81,520కు చేరగా.. మరణాల సంఖ్య 51,669కు పెరిగింది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,543 మంది డిశ్చార్జ్ అయ్యారని.. వీరితో కలిపి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,87,804కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,858 యాక్టివ్ కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.