వరంగల్ లో జరిగిన సంఘటనలకు బాధ్యులనే నెపంతో 38మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేసి జైలుకు పంపడం, బిజెపి నేతలపై అధికార పక్షం వారు ...
వరంగల్ లో జరిగిన సంఘటనలకు బాధ్యులనే నెపంతో 38మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేసి జైలుకు పంపడం, బిజెపి నేతలపై అధికార పక్షం వారు దాడులు జరపడం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో, అధికార పక్షం కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రమేయంతోనే జరిగిన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
ఈ సందర్భంగా రాష్ట్రమంత్రిగా కేటీఆర్చేసిన వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. మంత్రి అయిఉండి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
పరకాల శాసన సభ్యుడు, తెరసా నాయకుడు ధర్మారెడ్డి రామజన్మభూమి ట్రస్టు కార్యక్రమాలపై చేసిన ప్రకటనకు నిరసనగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారన్న నెపంతో బీజెపి నాయకులను అరెస్టుచేయడం తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని జరిగిందని భావించాల్సి వస్తుందని మండిపడ్డారు.
పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తనగుండాలతో బీజెపి కార్యకర్తల మీద దాడి చేయడం, తరువాత పోలీసు ష్టేషన్లో బీజెపి నాయకుల కార్లను ధ్వంసం చేయడం, అదికూడా పోలీసుల సమక్షంలో జరగడం ఒక దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి బిజెపి నాయకులు డాక్టర్ విజయచంద్రా రెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్ ని జేసీబీలతో కూల గొట్టించడం రాజకీయ పిరికిపందల లక్షణమని దుయ్యబట్టారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామజన్మభూమి ట్రస్టుకు చెందిన కార్యకర్తలమీద పోలీసులు లాఠీచార్జి చేయడం, వారిమీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, అందులో బీజెపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మతో పాటు మరోఐదుగురు మహిళా నాయకులను జైలుకు పంపడం వెనుక కేటీఆర్, దయాకర్ రావుల ప్రోధ్బలం ఉందని సంజయ్ స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా పోలీసులు శాంతి భద్రతలను రక్షించాల్పింది పోయి తెరాసా నాయకుల ఆదేశాలను పాటించడం, వారికి తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మఛ్చ అని విమర్శించారు.
అయోధ్య రామాలయ నిర్మాణం అంశం పైన, నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న విషయం మీద ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, ఇప్పటికైనా చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలకుబహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రామదండు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నదని స్పష్టం చేశారు.
ఇలా ఉండగా,, ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసంపై దాడి ఘటనలో అరెస్టు చేసిన తమ కార్యకర్తలను విడుదల చేయాలని, తమ కార్యాలయంపై దాడి చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతృత్వంలో సోమవారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హన్మకొండలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా సుబేదారి పోలీ్‌సస్టేషన్‌కు బయలుదేరారు.
పోలీసులు వారిని మధ్యలోనే హంటర్‌రోడ్డులో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తవాతావరణం నెలకొనడంతో పోలీసులు.. రావు పద్మను, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకే్‌షరెడ్డిని, కార్యకర్తలను అరెస్టు చేశారు.
రావు పద్మపై ఆదివారమే కేసు నమోదైన నేపథ్యంలో ఆమెతోపాటు 44 మంది బీజేపీ కార్యకర్తలను కోర్టులో హాజరుపరిచారు. వారికి ఆరో అదనపు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.
హింసాత్మక ఘటనలే టీఆర్‌ఎస్ లక్ష్యమైతే బీజేపీతో సంబంధం లేకుండా రామదండు కదిలితే ఏం జరుగుతుందో ఒకసారి రామాయణం చదువుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. శ్రీరాముడిపై టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మరో ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. బలాబలాలను తేల్చుకునేందుకు ఈ నెల 10వ తేదీ తర్వాత ఎక్కడైనా, ఎప్పుడైనా బాహాబాహీకి సిద్ధమని ప్రకటించారు.
సోమవారం పరకాలకు వెళ్లేందుకు బయలుదేరిన రాజాసింగ్‌ను యాదాద్రి జిల్లా కొండమడుగు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావును ఆలేరు శివారులో, యెండెల లక్ష్మీనారాయణ, ఇనగాల పెద్దిరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులను జనగామ జిల్లా పెంబర్తి వద్ద అరెస్టు చేశారు.