Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మిలటరీ గుప్పెట్లో మయన్మార్‌ - Vandebharath

  నేపిదా:  స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స...

 


నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 

  • 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్‌ వారినుంచి స్వాతంత్రం లభించింది.  
  • 1962: మిలటరీ నేత నీ విన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 
  • 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్‌ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 
  • 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్‌ అరెస్టు చేశారు. 
  • 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది.  
  • 1991, అక్టోబర్‌: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. 
  • 2010, నవంబర్‌ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.  
  • 2010, నవంబర్‌ 13: దశాబ్దాల హౌస్‌ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 
  • 2012: పార్లమెంట్‌ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు. 
  • 2015, నవంబర్‌ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి కట్టబెట్టింది.  
  • 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.  
  • 2019, డిసెంబర్‌ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 
  • 2020, నవంబర్‌ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 
  • 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్‌ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 
  • 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్‌ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది.