Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఉత్తరాఖండ్‌లో తోడినా కొద్దీ శవాలు... Vandebharath

ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్ ప్రాజెక్ట్‌ను బురద ముంచెత్తిన విషయం తె...



ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్ ప్రాజెక్ట్‌ను బురద ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 180 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇప్పటివరకు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. . గల్లంతైన వారికోసం ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సొమవారంనాటికి 26 మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. మంగళవారం మరో ఐదు మృతదేహాలను బురద, శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే రెండు రోజులు దాటిన నేపథ్యంలో.. గల్లంతైనవారి క్షేమంపై ఆందోళన పెరిగిపోతోంది.


చమోలి జిల్లాలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనపై ఆరాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. చమోలో జిల్లాలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారంనాడు ఏరియల్ సర్వే చేశారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రావత్ పరామర్శించారు. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే వారు కోలుసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. వారికి మెరుగైన వైద్య అందించాలని అధికారులకు సూచించారు సీఎం రావత్.ఘటనలో అదృశ్యం అయిన మరో 175 మంది ఆచూకీ లభించలేదు.

మరోవైపు భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరో సొరంగంలో చిక్కుకున్న 35 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు జరుగుతోందని ఉన్నతాధికారలు తెలిపారు. మరోవైపు.. తపోవన్‌-విష్ణుగడ్‌ జల విద్యుత్‌ కేం ద్రం సొరంగంలో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా బ యటకు తీసుకొచ్చే ప్రయత్నాలను ఐటీబీపీ, ఆర్మీ, జాతీ య, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. 12 అడుగుల ఎత్తు, 2.5 కిలోమీటర్ల పొడవున ఉన్న ఆ హెడ్‌ రేస్‌ టన్నెల్‌లో చాలా భాగం బురద పేరుకుపోయిన నేపథ్యంలో.. శిథిలాలను తొలగించి లోపలికి వెళ్లడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.