ఇదేదో గొంగలి కప్పుకున్న గొర్రె కాదు.. ఐదేళ్లుగా షేవింగ్ చేయని గొర్రె.. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనిపించింది. కళ్లు మీదకు కూడా ఉన...
ఇదేదో గొంగలి కప్పుకున్న గొర్రె కాదు.. ఐదేళ్లుగా షేవింగ్ చేయని గొర్రె.. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనిపించింది. కళ్లు మీదకు కూడా ఉన్ని వచ్చేసి.. దారి సరిగా కనపడక.. అంత భారాన్ని మోయలేక నీరసించిన దీన్ని లక్కీగా కొందరు పర్యాటకులు చూసి అధికారులకు సమాచారమిచ్చారు.. వారు వచ్చి.. ఈ గొర్రెను చూసి ఆశ్చర్యపోయారు.
మామూలుగా గొర్రెలకు ఉన్ని తీయడానికి కొన్ని నిమిషాల టైం పడితే.. దీనికి గంట పట్టిందట.. అది ఎంత బరువుందో తెలుసా? 35 కిలోలు. ఇది ఒకప్పుడు ఏదో గొర్రెల ఫాంలో ఉన్నదేనని.. తప్పిపోయి అడవికి చేరి ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని రోజులు ఇలాగే ఉండి ఉంటే.. నీరసించి.. చచ్చి ఉండేదట.. మొత్తమ్మీద గ్రహాంతర జీవిలా కనిపిస్తూ.. ఈ గొర్రె ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.