భార్యను దారుణంగా హత్య చేసిన భర్త - Vandebharath

 


ఖమ్మం​: జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత దారుణ హత్యకు గురైంది.. భర్తే.. భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మృతురాలు ఎర్రమల్ల నవ్య రెడ్డి (22)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నవ్యరెడ్డి కనబడటం లేదని మిస్సింగ్ కేసు నమోదయింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసు పెట్టింది కూడ భర్తే. 

మిస్సింగ్‌లో భాగంగా పోలీసులు విచారణ చేస్తుండగా.. శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్యరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త నాగశేషురెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు. నవ్యరెడ్డిని భర్త బైక్ పై తీసుకువెళ్తున్న సీసీటివి ఫుటేజ్‌ని పోలీసులు సేకరించారు. నిందితుడితో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం నాగశేషు రెడ్డితో నవ్యరెడ్డికి వివాహం జరిగింది. ఇద్దరిది మధిర మండలం ఏర్రుపాలెం గ్రామం. నవ్యరెడ్డి సత్తుపల్లి లో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతు ఉండగా...నాగశేషురెడ్డి బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]