Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం ఇప్పించండి - Vanebharath

  మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది. మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన ఆ మహిళ తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇవ్వమని ర...

 


మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది. మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన ఆ మహిళ తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇవ్వమని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే.. తన పొలం సరిహద్దుల్లో ఉన్న మరో పొలం యజమాని దారిని మూసివేయడంతో తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడం అసాధ్యంగా మారింది. ఇదే విశయాన్ని చాలాసార్లు స్థానిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులకు గత కొంతకాలం తాను ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా రైతు…తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని అనుకుంది. వెంటనే తన సమస్యపై రాష్ట్రపతికి ఒక లేఖ రాసింది. ఆ తరువాత ఆమె తన లేఖతో తన ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది, అంతే అది కాస్తా వైరల్ అయ్యింది.

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాలోని బర్ఖేడా గ్రామంలో నివసిస్తున్న బసంతి బాయి ఈ లేఖ రాశారు. బసంతి బాయి బంధువులలో ఒకరు ఇదే అంశంపై మాట్లాడుతూ.. “ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె నిస్సహాయంగా ఉంది, అధికారులకు ఒక లేఖ రాయాలని నిర్ణయించుకుంది. ఓ టైపిస్టు సహకారంతో ఈ లేఖ రాయించింది. రహదారి అడ్డుపడితే ఆమె తన వ్యవసాయ క్షేత్రానికి ఎలా చేరుకుంటుంది. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందకవడంతో బసంతి ప్రయాణానికి హెలికాప్టర్ అందించాలని కోరింది. ”