శ్రీకాళహస్తి (చిత్తూరు): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జాతీయ కలంకారీ కళాకారుడు జన్నలగడ్డ గుర్రప్పశెట్టి...
శ్రీకాళహస్తి (చిత్తూరు): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జాతీయ కలంకారీ కళాకారుడు జన్నలగడ్డ గుర్రప్పశెట్టి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కలంకారీలో విశిష్ట నైపుణ్యాలు ప్రదర్శించడంతో 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. శ్రీకాళహస్తిలో కలంకారీ వఅత్తిని మెరుగుపరిచి పలువురిని జాతీయస్థాయి కలంకారీ కళాకారులుగా తీర్చిదిద్దారు. శ్రీకాళహస్తిలో పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా గుర్రప్పశెట్టి గుర్తింపు పొందారు.