చిత్తూరులో ఎన్నికల వార్ కొనసాగుతుంది.. రెండు విడతల ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగుర వేసింది.. టీడీపీకి అనుకూలంగా వస్తాయి అనుకు...
చిత్తూరులో ఎన్నికల వార్ కొనసాగుతుంది.. రెండు విడతల ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగుర వేసింది.. టీడీపీకి అనుకూలంగా వస్తాయి అనుకున్న స్థానంలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగలడం పై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు మరో అంశం ఆసక్తిగా మారింది. నిన్న జిల్లాలో జరిగిన రెండో విడత పోలింగ్ లెక్కింపు పై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లోనీ ప్రజలు ఓట్ల లెక్కింపు ను అక్కడే చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బ్యాలెట్ బాక్సులను తియనియకుండా అడ్డుకున్నారని సమాచారం.
వివరాల్లోకి వెళితే.. మదనపల్లె లోని ఓట్లు లెక్కింపును తమ గ్రామంలోనే చేపట్టాలని కోళ్లబైలు గ్రామస్థులు డిమాండు చేశారు. శనివారం కోళ్లబైలు పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు. బయ్యారెడ్డి కాలనీలో, కోళ్లబైలులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తికాగా అధికారులు బ్యాలెట్ బాక్సులను బయ్యారెడ్డి కాలనీలోని పోలింగ్ కేంద్రానికి వాహనాల్లో తరలించడానికి ఉపక్రమించగా.. గ్రామస్థులు అంగీకరిచలేదు. రోడ్డుపై వాహనాలను నిలిపి అడ్డుకొని రాత్రి 7 గంటల వరకు ధర్నా చేశారు..
ఈ విషయం పై ఎమ్మార్వో కుప్పుస్వామి, డీఎస్పీ రవిమనోహరాచారి వారితో మాట్లాడినా వినలేదు. ఫలితంగా రాత్రి 8 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రారంభం కాలేదు. అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆనందరెడ్డి, బయ్యారెడ్డిలతో మాట్లాడిన అనంతరం రాత్రి 9 గంటలకు బ్యాలెట్ బాక్సులను తరలించడానికి అంగీకరించారు. 9.15 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. గ్రామస్తుల ఘటన పై జిల్లా పై అధికారులు వచ్చి గ్రామస్తులతో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ విషయం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉందని వెల్లడించారు.వారి హామీతో అంగీకరించారు. కోళ్లబైలు నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ బందోబస్తు మధ్య బయ్యారెడ్డి పోలింగ్ కేంద్రానికి తరలించారు.. ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. మరి ఏ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందో చూడాలి..