Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

Ind vs Eng: రెండో రోజు టీమిండియా - Vandebharath

  చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు టీమిండియా ఆలౌటైం...

 


చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడాడు. 300/6తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో ఏడు ఓవర్లే బ్యాటింగ్ చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. మెయిన్ అలీ ఆదివారం తొలి ఓవర్‌లో అక్షర్ పటేల్, ఇషాంత్‌ను ఔట్ చేయగా… 96వ ఓవర్ లో స్టోన్.. కుల్ దీప్, సిరాజ్ ను ఔట్ చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది.

తొలి టెస్టులో పరాజయం ఎదుర్కున్న కోహ్లీసేన.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. అటు ఇంగ్లాండ్ కూడా తమ జట్టులో కీలక మార్పులతో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. అలాగే ఇంగ్లాండ్‌లో బ్రాడ్, స్టోన్, ఫోక్స్ ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు.

భారత జట్టు(ఫైనల్ ఎలెవన్): రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు(ఫైనల్ ఎలెవన్): సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.