లడఖ్ నుంచి చైనా బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా మరో కుట్రకు పాల్పడింది. లడఖ్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటూనే, అటు మయన్మార్ కు రహస్యంగా విమ...
లడఖ్ నుంచి చైనా బలగాలను ఉపసంహరించుకుంటున్న చైనా మరో కుట్రకు పాల్పడింది. లడఖ్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటూనే, అటు మయన్మార్ కు రహస్యంగా విమానాల ద్వారా సైనికులను, ఇంటర్నెట్ ఎక్స్ పర్ట్ లను చేరవేస్తున్నట్టు ఆస్ట్రేలియాకు చెందిన మేధోమధన సంస్థ పేర్కొన్నది. దీంతో ఇండియా అలర్ట్ అయ్యింది. ఆగ్నేయాసియా, ఈస్ట్ ఆసియా దేశాలతో సత్సంబంధాల కోసం యాక్ట్ ఈస్ట్ పాలసీని పాటిస్తోంది. ఇది ఇండియాకు చాలా కీలకం. దానికోసం మయన్మార్ ను కీలక వారధిగా వాడుకుంటోంది. అయితే, మయన్మార్ లో సైనికులు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తరువాత ఆ దేశంలో డ్రాగన్ కదలికలు పెరుగుతుండటంతో ఇండియా ఆందోళన చేస్తున్నది. దక్షిణ చైనాలోని కన్మింగ్ నుంచి మయన్మార్ లోని యాంగూన్ కు రాత్రి వేళల్లో రోజుకు ఐదు విమానాలు తిరుగుతున్నాయని, వాటి ద్వారా సైనికులను, ఆయుధాలను, సైబర్ నిపుణులను పంపుతున్నట్టు ఆస్ట్రేలియా సంస్థ పేర్కొన్నది. మయన్మార్ లో సైనిక పాలనకు మద్దతు ఇచ్చేందుకు చైనా ఇలా చేస్తున్నట్టు సమాచారం. అయితే, చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ సంస్థ దీనిని ఖండించింది.