Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఔను.. వీళ్లిద్దరూ మగ కవలలే..! Vandebharath

  సావో పాలో : మగ వారుగా పుట్టి ఆడవారుగా మారడం మనం చూస్తుంటాం. అయితే, అన్నాదమ్ములుగా ఉన్న ఇద్దరు.. అక్కాచెల్లెలుగా మారడం ప్రపంచంలోనే ఇదే తొలి...

 


సావో పాలో : మగ వారుగా పుట్టి ఆడవారుగా మారడం మనం చూస్తుంటాం. అయితే, అన్నాదమ్ములుగా ఉన్న ఇద్దరు.. అక్కాచెల్లెలుగా మారడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కాబోలు. బ్రెజిల్‌కు చెందిన మగ కవల పిల్లలు.. ఆడ కవలుగా మారి చరిత్రలో స్థానం పొందారు. కవలలుగా పుట్టిన వీరు తమకు ఆడపిల్లలుగా ఉండటమే ఇష్టం అని ఇద్దరూ లింగమార్పిడి చేయించుకున్నారు. ఇలాంటి కేసు ఇదే మొదటిదని వైద్యులు అంటున్నారు.

ఆగ్నేయ బ్రెజిల్‌కు చెందిన 19 ఏండ్ల వయసున్న మగ కవలలు తాము ఆడపిల్లలుగా ఉండటానికే ఇష్టపడ్డారు. ఎన్నోరోజులుగా కలలుగన్న వీరిద్దరూ ఒకేసారి లింగమార్పిడి చేయించుకుని అక్కాచెల్లెలుగా మారారు. వీరు చిన్నప్పటి నుంచి మగ పిల్లల మాదిరిగా బిహేవ్‌ చేయలేదంట. ఇద్దరూ కలిసి పెరుగుతూ లింగమార్పిడి చేయించుకోవాలన్న అభిలాషతో ఉండి.. ఆ కోరికను నిజం చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. జర్మనీలోని బ్లమెనౌకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ సెంటర్‌లో డాక్టర్‌ జోస్‌ కార్లోస్‌ మార్టిన్స్‌ దాదాపు ఐదు గంటల శస్త్రచికిత్స జరిపి వారిని ఆడపిల్లలుగా మార్చేశారు. ఇప్పుడు వారిద్దరి పేర్లు మేలా రెజెండే, సోఫియా అల్బుకెర్క్‌. సావో పాలోలో అక్క అల్బుకెర్క్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నది. లింగమార్పిడి జరిగిన తర్వాత వారం రోజులకు తమ ప్రయాణం గురించి వెల్లడిస్తూ 'నా శరీరం అంటే నాకెంతో ప్రేమ. అయితే జననేంద్రియాలే నచ్చలేదు' అని చెప్పింది అర్జెంటీనాలో వైద్యవిద్య చదువుతున్న నల్లజుట్టుతో ఉన్న మేలా రెజెండే. 'నేను గాల్లోకి డాండేలైన్‌ విత్తనాలను ఊది దేవుడా నన్ను అమ్మాయిగా మార్చు' అని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపింది. శస్త్రచికిత్స అనంతరం తమ శరీరాలను చూసి ఎంతో సంతోషపడ్డామని మేలా వెల్లడించింది. అక్కగా మారిన సోఫియా అల్బుకెర్క్‌ రిజర్వ్‌ అయినందున తక్కువగా మాట్లాడుతుందని మేలా చెప్పింది. లింగమార్పిడికి ముందు మేం ఎంత స్నేహంగా ఉన్నామో.. ఇప్పుడు కూడా అంతే స్నేహం కొనసాగిస్తున్నామని మేలా పేర్కొన్నది. బాల్యంలో, కౌమార దశలో ఎన్నో అవమానాలను, లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కవల సోదరులు కవల సోదరీమణులుగా మారడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని ట్రాన్స్‌జెండర్‌ సెంటర్‌కు చెందిన డాక్టర్‌ మార్టిన్స్‌ చెప్పారు.