Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపు - Vandebharath

గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్రమంత్రి తెలిపారు. కోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదని.....


గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్రమంత్రి తెలిపారు. కోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదని.. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనిది అన్నారు.


ఏపీ హైకోర్టు తరలింపుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. కోర్టు తరలింపుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారని.. అయితే హైకోర్టుతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం ఉంటుంది అన్నారు. అలాగే హైకోర్టు నిర్వహణ, ఖర్చు బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. హైకోర్టు పరిపాలన బాధ్యతలు మాత్రం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని.. తరలింపుపై ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలి అన్నారు. కోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదని.. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనిదని తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ రాజధానిగా కర్నూలు.. శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అయితే రాజధాని తరలింపుపై అడుగులు వేయగా.. కోర్టుల్లో పిటిసన్లు దాఖలు చేయడంతో ఆ ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా తరలించాలనే ఉద్దేశంతో ఉంది.