Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బిజెపి నేతలు నిద్రపోతున్నారా ? Vandebharath

  విశాఖ :  విశాఖలో ఉక్కు వేడి రాజేస్తోంది. గంటా రాజీనామాతో ఆ వేడి మరింత పెరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మా...

 


విశాఖ : విశాఖలో ఉక్కు వేడి రాజేస్తోంది. గంటా రాజీనామాతో ఆ వేడి మరింత పెరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. '' ఇంత పెద్ద విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంటే.. బిజెపి నేతలు నిద్రపోతున్నారా ? ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి బిజెపి లోకి వెళ్లిన ఎంపి ఒకాయన ' ఇది చాలా మంచి నిర్ణయం.. దీనివల్ల లాభాలస్తారు.. స్టాక్‌మార్కెట్‌ లో షేర్‌ వ్యాల్యూ పెరుగుతుంది.. ' అని చెపుతున్నారు. విశాఖలో ఎంతోమంది త్యాగాల మీద ఈ స్టీల్‌ ప్లాంట్‌ వచ్చింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమై విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఉద్యమాన్ని సాగించారు. ' విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ' అని నినదించారు. ఇదేం ఆషామాషీగా ఏర్పడింది కాదు.. 32 మంది ఆనాడు ఈ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రాణాలదిలారు. సంఘటితంగా సాధించినదే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌..


తెలుగోడి దెబ్బేంటో ఢిల్లీకి చూపించిన సందర్భమది.. నేనొక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను.. బిజెపి కి గానీ, మిగిలిన రాజకీయ పక్షాలకు గానీ, మా ముఖ్యమంత్రి గారికి గానీ, మా ప్రభుత్వం గానీ, మేం గానీ, మా పార్లమెంట్‌ సభ్యులే గానీ, మా శాసన సభ్యులే గానీ, మా ప్రజాప్రతినిధులే గానీ, మేమంతా కోరేదొక్కటే.. వెంటనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రయివేటీకరణను ఒప్పుకునేది లేదు. దానికోసం రాజీలేని పోరాటం చేస్తాం. పారదర్శకంగా, అంకితభావంతో పోరాడతాం. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించబోం.

ఇంత పెద్ద విషయాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని మిగిలిన రాజకీయ పక్షాలకు చెబుతున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు 10 మంది 10 రకాల స్టేట్‌మెంట్‌ లు ఇచ్చారు. చంద్రబాబు ఏమో జగన్మోహన్‌ రెడ్డి కుట్ర చేశారని అంటారు.. లోకేశ్‌ ఏమో గవర్నమెంట్‌ కొనాలి అంటారు..

ఎంపి లేమో రకరకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారా ? ఓ విధానం ఉందా ? ఆనాడు మీరు సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పి ఇలానే ప్రజలను అయోమయానికి గురిచేశారు.

ఇప్పుడు ఈ విషయాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మాకెలాంటి బేషజాలాలు లేవు. ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.

అందరితోనూ కలిసి పనిచేస్తాం. ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం. ఉత్తుత్తి రాజీనామాలతో ఏం ప్రయోజనం ఉండబోదు. పదవిలో ఉంటేనే ప్రశ్నించగలం.. కానీ చాలామంది వెన్నుచూపి పారిపోతున్నారు. '' అని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు.