లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకూ పాఠశాలలను ఈనెల 10 నుంచి తెరవనున్నారు. దీనిపై యూపీ సర్కార్ ప్రత్యేక గైడ్‌లైన్స్ విడు...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకూ పాఠశాలలను ఈనెల 10 నుంచి తెరవనున్నారు. దీనిపై యూపీ సర్కార్ ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలతో పాటు మాధ్యమిక, ఉన్నత పాఠశాలను కూడా తెరవనున్నారు. ప్రతీ తరగతిలోనూ 50 శాతం విద్యార్థులు హాజరుకావచ్చు.
అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నిర్వహించనున్నారు. అయితే స్కూళ్లలోని క్యాంటీన్లను మూసివేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం 6 వ తరగతి విద్యార్థులు సోమవారం, గురువారం, 7వ తరగతి విద్యార్థులు మంగళవారం, శుక్రవారం, 8వ తరగతి విద్యార్థులు బుధవారం, శనివారం తరగతులకు హాజరుకావలసి ఉంటుంది. ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకూ గల విద్యార్థులు కూడా ఇదే విధంగా వారంలో రెండు రోజుల పాటు తరగతులకు హాజరుకానున్నారు.