మదనపల్లె జంట హత్య కేసులో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. తాజాగా అలేఖ్య, సాయి దివ్యల పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు వెలుగుచూశాయి. ఇన్‌స...
మదనపల్లె జంట హత్య కేసులో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. తాజాగా అలేఖ్య, సాయి దివ్యల పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు వెలుగుచూశాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెంపుడు కుక్కతో ఉన్న అలేఖ్య ఫొటో ప్రత్యక్షమైంది. దీంతో అలేఖ్యకు ప్రియుడు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరువు కోసమే ఈ జంట హత్యలు జరిగాయంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అలేఖ్య, సాయి దివ్యల తల్లిదండ్రుల మానస్థిక స్థితి బాగోలేదు. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వారు కోలుకునేవరకు ఏం జరిగిందో బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఇంతలోనే అలేఖ్యకు ప్రియుడు ఉన్నాడంటూ వార్తలు రావడంపై పోలీసులు మండిపడుతున్నారు. కొంతమంది ఫేమస్ కావడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.