Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ విమర్శల దాడి - Vandebharath

  న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. దేశ బడ్జెట్‌తో చెలగాటమాడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ద...

 




న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శల దాడి కొనసాగుతోంది. దేశ బడ్జెట్‌తో చెలగాటమాడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో సామాన్యుడిని దారుణంగా దెబ్బతీసిందని రాహుల్‌ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌ కారణంగా ద్రవ్యోల్బణం పైకి ఎగబాకడంతో ఎల్పీజీ సిలిండర్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయనే వార్తాపత్రిక కథనాన్ని ట్విటర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

మోదీ ప్రభుత్వం బడ్జెట్‌తో సామాన్యుడిని, దేశాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌ పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఉందని గతంలోనూ రాహుల్‌ మోదీ సర్కార్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రైతులపైనా బడ్జెట్‌ భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతుల ఇబ్బందులకు తోడు పెట్రోల్‌-డీజిల్‌ ధరలు వారికి మరింత భారమయ్యాయని అన్నారు.