Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

INDIA vs ENGLAND: పిచ్ పై అనవసర చర్చలొద్దు: రోహిత్ శర్మ - Vandebharath

  భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా పిచ్‌లను తమకు అనూకూలంగా మార్చుకుందని వస్తున్న విమర్శలపై టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మండిపడ...

 


భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా పిచ్‌లను తమకు అనూకూలంగా మార్చుకుందని వస్తున్న విమర్శలపై టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మండిపడ్డాడు. రోహిత్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. రోహిత్ మాట్లాడుతూ.. పిచ్‌ అనేది ఇరు జట్లకు సమానంగానే ఉంటుంది. కొన్నేళ్ల నుంచే ఇండియాలో అన్ని క్రికెట్ పిచ్‌లను ఒకేలా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఇంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లు కూడా ఇవే పిచ్‌లపై నిర్వహించారు. ఆ సమయంలో రాని చర్చలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి.. దీనిపై ఇంత డిబేట్‌ ఎందుకు. పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుందని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. అయినా ఏ జట్టైనా తమ సొంత పిచ్ లు తమకే అనుకూలంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అన్ని జట్టు అలానే అనుకుంటాయి.

ఇతర దేశాల్లో మేం పర్యటించినప్పుడు మాకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. మేం ఇటీవలే ఆసీస్‌ పర్యటనకు వెళ్లి వచ్చాం. ఆసీస్‌ జట్టు వారి సొంత పిచ్ లను వారికి అనుకూలంగా తయారుచేసుకోలేదా.. టీంఇండియా వారితో పోరాడి సిరీస్‌ గెలవలేదా? మేం ఇతర దేశాలకు వెళ్లి ఆడినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు మా గురించి పట్టించుకోరు.. ఇప్పుడు అంతే.. వేరే జట్టు ఇక్కడకు వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం. హోం అడ్వాంటేజ్‌ అనే మాటలు పట్టించుకోకుండా ఆడితే బాగుంటుంది. పిచ్ లపై అభ్యంతరాలుంటే ఐసీసీతో చర్చించి.. ఆ రూల్స్ మార్చేలా చేయండి. ఇంతటితో ఇలాంటి పనిలేని ఆరోపణలు విరమిస్తే బాగుంటుంది. పిచ్‌పై అనవసర చర్చలను పక్కనపెట్టి మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శనలపై మాట్లాడుకుంటే బాగుంటుందని రోహిత్ హితవు పలికాడు.

కాగా, ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో రోహిత్‌ శర్మ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. అశ్విన్‌ సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ 9వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయం చేకూర్చాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది.