వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిత లక్షా 90 వేల కోట్ల డాలర్ల (1.9 ట్రిలియన్ డాలర్లు) కోవిడ్19 ప్యాకేజీకి ప్రతినిధుల సభ ...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిత లక్షా 90 వేల కోట్ల డాలర్ల (1.9 ట్రిలియన్ డాలర్లు) కోవిడ్19 ప్యాకేజీకి ప్రతినిధుల సభ ఆమోదం దక్కింది. ఈ ఉద్దీపన ప్యాకేజీని అధ్యక్షుడు బైడెన్ ప్రవేశపెట్టారు. కోవిడ్ వల్ల నష్టపోయినవారికి ఈ నిధితో కొంత ఊరట లభించనున్నది. నిరుద్యోగ అమెరికన్లు, వ్యాపారులు, బ్రతుకీడుస్తున్న కుటుంబాలకు ఈ ప్యాకేజీతో బిలియన్ల డాలర్లు అందనున్నాయి. బిల్లు ఆమోదం కోసం అనుకూలంగా 219 ఓటేశారు. వ్యతిరేకంగా 212 మంది ఓటేశారు. గంటల పాటు జరిగిన చర్చ తర్వాత శుక్రవారం రాత్రి దీనిపై ఓటింగ్ జరిగింది. డెమోక్రాట్ నేతలు జేర్డ్ గోల్డెన్, కుర్ట్ ష్రేడర్‌లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ప్యాకేజీ కింద ఏడాదికి 75వేల డాలర్ల నుంచి లక్షా 50 వేల డాలర్లు ఆర్జించే ఒక్కొక్కరికి 1400 డాలర్లు ఇవ్వనున్నారు. నేరుగా అకౌంట్‌లోనే ఈ డబ్బలు వేయనున్నారు. ఆగస్టు చివరి వరకు నిరుద్యోగులకు అదనంగా 400 డాలర్లు ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ సరఫరా కోసం 50 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నారు. హౌజ్‌లో ఆమోదం పొందిన ఈ ప్యాకేజీ ఇక సేనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది.