Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం... ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి - Vandebharath

  పీఎస్‌ఎల్వీ సీ 51 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్)ను ఆదివారం ఉదయం 10.24కు నింగిలోకి విజయవంతంగా పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. ఈ ప...

 


పీఎస్‌ఎల్వీ సీ 51 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్)ను ఆదివారం ఉదయం 10.24కు నింగిలోకి విజయవంతంగా పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన 637 కేజీల బరువు కలిగిన అమెజానియా-01 అనే ఉపగ్రహం (Satellite)తో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం ఇదే. ఈ విజయాన్ని ఇస్రో... దేశ ప్రజలతో పంచుకుంది. ట్విట్టర్ ద్వారా సమాచారం అందించింది.


గతేడాది.. అంటే 2020 మొత్తం కరోనాపాలైంది. ఏడాది అంతా చేదు అనుభావాలే. కరోనా మహమ్మారి ఇస్రో పైనా ప్రభావం చూపించింది. ఆ చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. చంద్రయాన్‌ -3, ఆదిత్య -ఎల్‌ 1, గగన్‌యాన్‌కు ఇలా వరుస ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందడుగులు వేస్తోంది.

ఇదీ రాకెట్ ప్రత్యేకత:
ఈ రాకెట్‌ను పీఎస్‌ఎల్వీ డీఎల్‌గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడో ప్రయోగం. రాకెట్‌లో ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లతో నిర్వహించారు. నాలుగో దశలో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను రెండుసార్లుగా సన్‌ సింక్రనైజ్ ఆర్బిట్‌ (కక్ష్య)లోకి ప్రవేశపెట్టారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్‌షీల్డ్‌ విడిపోయింది. తరువాత రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తయి 16.36 నిమిషాలకు నాలుగో దశ కటాఫ్‌ అయ్యింది. ఆ తర్వాత 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కేజీల బరువున్న అమెజానియా -01 ఉపగ్రహంను... భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనైజ్ ఆర్బిట్‌ (కక్ష్య)లోకి ప్రవేశపెట్టారు.

మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం 9 సెకెన్లకు పీఎస్‌-4ను రీస్టార్ట్‌ చేసి సరిగ్గా 18 సెకెన్ల తరువాత కటాఫ్‌ చేస్తారు. మళ్లీ రెండోసారి34 సెకెన్ల తరువాత రీస్టార్ట్‌ చేసి 1 గంట 52 నిమిషాలకు కటాఫ్‌ చేస్తారు. మరో 32 సెకెన్ల తరువాత యూఎస్‌ చెందిన స్పేస్‌బీస్‌ శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్‌-1 నానోకాంటాక్ట్‌-2 అనే మరో ఉపగ్రహాన్ని కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని సన్‌సింక్రనస్‌ అర్బిట్‌లో ప్రవేశపెడతారు. సరిగ్గా 1 గంట 55 నిమిషాల 7సెకెన్లకు భారత ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఉపగ్రహాలు సతీష్‌ ధవన్‌శాట్, సింధునేత్ర, వివిధ రకాల యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన యూనిటీశాట్‌లో భాగంగా ఉన్న శ్రీశక్తిశాట్, జిట్‌శాట్, జీహెచ్‌ఆర్సీ ఈశాట్‌ అనే ఐదు ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్ష కక్ష్యలోకి వదిలిపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేసుకున్నారు. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 78వది, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం ఇది.

స్పేస్ రిఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన నాలుగు శాటిలైట్స్ కూడా ఈ ప్రయోగంలో ఉండటం విశేషం.