Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మంత్రులకు జగన్ బిగ్ షాక్ - Vandebharath

  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొంత మంది వైసీపీ మంత్రులు సమర్థవంతంగా పని చేయలేదు అంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ప్...

 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొంత మంది వైసీపీ మంత్రులు సమర్థవంతంగా పని చేయలేదు అంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ప్రధానంగా ఆదాయం వచ్చే శాఖల్లో ఉన్న మంత్రులు సమర్థవంతంగా పని చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ ఈ విషయం తెలియని చాలా మంది మంత్రులు అసలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజకీయంగా ఇప్పటికే చాలా వరకు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైసీపీకి ఇబ్బందులు వస్తున్న పరిస్థితి.

ఈ తరుణంలో ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది మంత్రులు ప్రజలతో మమేకం కావడం లేదు. ఇక ఆదాయం వచ్చే శాఖలో ఉన్న మంత్రులు అయితే అసలు తమ శాఖల మీద దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ప్రభుత్వం మీద కూడా పెట్టకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిపోతుందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయంలో కూడా చాలామందిలో ఆగ్రహం ఉంది అనే విషయం చెప్పవచ్చును. అయితే ఇప్పుడు ఆదాయం వచ్చే శాఖల మీద ముఖ్యమంత్రి జగన్ కూడా ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

కొంతమంది సమర్థవంతంగా పని చేయలేని మంత్రుల శాఖలను తగ్గించే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ మంత్రి శాఖలో మంచి ఆదాయం వస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారి శాఖలో కూడా మంచి ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం మాత్రం పెద్దగా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడటంలేదు. వాళ్లు కూడా పెద్దగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వారి శాఖలను తగ్గించే ఆలోచనలో ఉన్నారని వారి శాఖలు మరో మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.