Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పర్సులో 100గ్రాముల డ్రగ్స్.. Vandebharath

బెంగాల్ లో బీజేపీ యువ మోర్చా మహిళా నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నిషేధిత డ్రగ్స్ తో పట్టుబడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నార...



బెంగాల్ లో బీజేపీ యువ మోర్చా మహిళా నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నిషేధిత డ్రగ్స్ తో పట్టుబడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే...బెంగాల్ లోని హిగ్లీ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పమేళా గోస్వామి నియమించబడ్డారు. అయితే పమేళా తాజాగా 100 గ్రాముల కొకైన్ తో పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె తన తన ఫ్రెండ్ కొలీగ్ ప్రబీర్ కుమార్ డే అనే యువకుడితో కలిసి ఓ కేఫ్ కు వెళుతుండగా పోలీసులు ఆమె కారును తనికిచేశారు. కాగా ఆమె కారులో సీటు కింద పర్సు దాచినట్టు గుర్తించారు. ఆమె పర్సును వెతకగా పర్సులో 100 గ్రాముల నిషేధిత కొకైన్ కనిపించింది. దాంతో పమేలా గోస్వామి తో పాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో తనను అన్యాయంగా అరెస్ట్ చేసారని కేకలు వేసింది. పమేలా ప్రబీర్ గత కొద్దిరోజులుగా ఒకే కేఫ్ కు వెళుతూ అక్కడ కార్ పార్క్ చేసి ఎక్కువ సేపు స్నేహితులతో మాట్లాడుతున్నారు. కొంతమంది యువకులు బైకులపై వచ్చి ప్రతిరోజు గంటల తరబడి పమేలతో మాట్లాడుతున్నారు.


దాంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిపై నిఘా పెంచారు. పమేలా ప్రణీబ్ ప్రతి రోజు కేఫ్ లు వెళ్లే దారిలో పెట్రోలింగ్ చేసి వారి కారును పట్టుకున్నారు. ఆ వాహనాన్ని చెక్ చేశారు. కాగా ఆమె కారు మొత్తం వెతకగా ఏమి లభ్యం కాలేదు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో సీటు కింద చెక్ చేశారు. దాంతో పోలీసులకు 100 గ్రాముల కొకైన్ ప్యాకెట్ లు లభ్యం అయ్యాయి. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా పమేలా గోస్వామి బీజేపీ లో చేరక ముందు ఎయిర్ హోస్టెస్ గా పని చేసేవారు. మోడల్ గా కూడా పమేలా వ్యవహరించారు. అంతే కాకుండా కొన్ని బెంగాలీ సీరియల్స్ లో ఆమె నటించి అలరించారు. కాగా ఆమె యాక్టివ్ నెస్ చూసి బీజేపీ ఆమెకు హిగ్లీ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అబ్జర్వర్