Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కోజికోడ్ రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాల కలకలం.. 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు స్వాధీనం - Vandebharath

  కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు కోజి...

 

కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలు కోజికోడ్ రైల్వేస్టేషనులో లభ్యమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో చెన్నై మంగళపురం ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చిన రమణీ అనే ప్రయాణికురాలి వద్ద నుంచి 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు లభించాయి. పేలుడు (gelatin sticks, detonators) పదార్థాలను స్వాధీనం చేసుకున్న కోజికోడ్ రైల్వే పోలీసులు తమిళనాడు ప్రాంతానికి చెందిన రమణిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కాగా తాము బావులను తవ్వించేందుకు జిలెటిన్ స్టిక్కులు, డిటోనేటర్లను తీసుకువచ్చినట్లు రమణీ పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమవడంతో పోలీసులు ఈ ఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు పలు ప్రాంతాల్లో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు.

కాగా.. ముంబైలో గురువారం పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ స్కార్పియో వాహనం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే పేలుడు పదార్థాలు దొరికిన కారులో ఉన్న నంబర్‌ ప్లేట్లలో కొన్ని ముఖేశ్‌ అంబానీ భద్రతా బృందంలో ఉపయోగించే వాహనాల్లో ఉన్న నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ అయ్యాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతంలో భద్రతను పెంచి ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.