ప్రకంపనలు రేపుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో బాంబు పేల్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయివున్న ...
ప్రకంపనలు రేపుతున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో బాంబు పేల్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయివున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మాత్రం డ్రగ్స్ ఎక్కడి నుంచో తెప్పించుకుని తన ఇంట్లో దాచిపెట్టి, ఆ తర్వాత తీసుకెళ్లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. పైగా, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేసింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు వ్యవహారం కాస్త అనేక
మలుపులు తిరిగి చివరకు బాలీవుడ్ డ్రగ్స్ దందాకు చేరుకుంది. ఈ కేసుకు
సంబంధించి నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్‌సిబి ఎదుట హాజరు అయ్యారు.
తన నివాసంలో దొరికిన మాదకద్రవ్యాలు పూర్తిగా తోటి నటి రియాకు చెందినవే అని
తెలిపారు.