మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది. ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది.
చెప్పుల షాప్ యజమాని మున్నా, కుటుంబసభ్యులను సీబీఐ అధికారులు
విచారించారు. మున్నా బ్యాంక్ లాకర్‌లో రూ 48 లక్షలు, 25 తులాల బంగారాన్ని
అధికారులు గుర్తించారు.
మున్నాకు వివేకానంద రెడ్డి సన్నిహితుడిగా ఉండేవారని చెబుతున్నారు. వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు పంచాయతీలో మున్నా ప్రమేయం ఉన్నట్లు
తెలుస్తోంది. పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు
అనుమానిస్తున్నారు. మరికొన్ని బ్యాంక్ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలపై
కూడా సీబీఐ ఆరా తీసింది.