పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈవో అయోధ్య రామమందిరంలో ఓంకార ధ్వనులను ప్రతి ధ్వనింపజేసే ఘంటానాదానికి ఐదో శక్తిపీఠం అమ్మవారు జోగుళాంబదేవి ఆశీ...
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈవో
అయోధ్య రామమందిరంలో ఓంకార ధ్వనులను ప్రతి ధ్వనింపజేసే ఘంటానాదానికి ఐదో శక్తిపీఠం అమ్మవారు జోగుళాంబదేవి ఆశీస్సులు అందాయి. భక్తురాలు రాజ్యలక్ష్మి ఈ గంటను రామ రథయాత్ర ద్వారా అయోధ్యకు చేరుస్తున్నారు. రామేశ్వరం టు రామ జన్మభూమి పేరిట 613 కిలోల ఈ గంటను అయోధ్యకు చేర్చేందుకు సెప్టెంబర్ 17న రామరథ యాత్రను ప్రారంభించారు.
శుక్రవారం ఈ యాత్ర తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయానికి చేరుకుంది. ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్ అర్చకులతో కలసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 21రోజుల పాటు 4,552 కిలోమీటర్లు, పది రాష్ట్రాల మీదుగా భక్తుల పూజలందుకుంటూ అయోధ్యకు ఈ గంటలను చేరుస్తామని రథసారథి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.