దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్ హైదరాబాదులో - vandebharath

 


హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యల తొలగింపునకు తీసుకుంటున్న అనేక చర్యల్లో కీలక ప్రాంతాల్లో ఫ్లైఓవర్ లు, వంతెనలు నిర్మించడం ఓ ప్రాధాన్యతాంశం. ఈ క్రమంలో నిర్మించిందే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ వంతెనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జిగా పేర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణంతో జూబ్లీహిల్స్మాదాపూర్ మధ్య ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రంగురంగుల విద్యుద్దీప కాంతులతో వంతెన జిగేల్మంటోంది. అయితే ఈ బ్రిడ్జిపై శని, ఆదివారాల్లో మాత్రం వాహనాలను అనుమతించరు. ఈ రెండు రోజులు పర్యాటకులు కాలినడకన బ్రిడ్జి అందాలు ఆస్వాదించవచ్చు.

ఈ వంతెన ముఖ్యాంశాలు
•దీని పొడవు 754.38 మీటర్లు
•దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తుతో వంతెన నిర్మాణం
•రూ.184 కోట్ల వ్యయంతో నిర్మాణం
•ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా కేబుళ్ల దిగుమతి
•బ్రిడ్జి నిర్మాణంలో 13 ఫౌండేషన్లు, కేవలం రెండు పిల్లర్లు
•నిర్మాణంలో పాలుపంచుకున్న 8 దేశాల ఇంజినీర్లు
•వంతెనను నిర్మించిన ఎల్ అండ్ టీ
•ఈ కేబుల్ బ్రిడ్జితో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి తగ్గిన దూరం
•బ్రిడ్జిపై మొత్తం 40 వేల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]