Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పరువు హత్య: హేమంత్‌ తల్లి ఆరోపణ - vandebharath

  నగరంలో పరువు హత్య కేసు కలకలం రేపుతోంన్న సంగతి తెలిసిందే. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు....

 


నగరంలో పరువు హత్య కేసు కలకలం రేపుతోంన్న సంగతి తెలిసిందే. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు... ఆమె తండ్రి! చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు గచ్చిబౌలిలోలోని టీఎన్జీఓ కాలనీలో నివాసముంటున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించని యువతి తండ్రి లక్ష్మారెడ్డి అమ్మాయి మేనమామ సాయంతో నమ్మించి హేమంత్‌ను బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి మేనమామ హేమంత్‌కు ఉరి వేసి చంపాడు. ఆ తర్వాత హేమంత్‌ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలోకి తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు.

అయితే ఈ హత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు. ఘటనా స్థలానికి వెళ్లి హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. హేమంత్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సంగారెడ్డి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
 

కులాలు వేరు కావడమే హేమంత్‌ హత్యకు కారణమని అతడి తల్లి ఆరోపించారు. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుమారుడిని పెంచుకున్నామని ఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్త చేశారు. పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. గురువారం సాయంత్రం పదిమంది ఇంట్లోకి వచ్చి జంటను కారులో అపహరించారని తెలిపారు.