Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మొదట బుల్లెట్ దించేది భారత ఆర్మీనే - చైనా మీడియా ఆందోళన - vandebharath

  భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయి. అయితే, రెండు దేశాల ...

 


భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా రెండు దేశాలు దౌత్య, సైనిక స్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయి. అయితే, రెండు దేశాల మీడియాల్లో దీనికి భిన్నమైన కథనాలు వస్తున్నాయి.

ఈ విషయంపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. భారత్‌ వైపు నుంచి తూటాలు పేలితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ కథనంలో వ్యాఖ్యలు చేశారు.

''సరిహద్దుల్లో భారత్ సైనిక మోహరింపులు పెరిగాయని సైనిక పరిశీలకులు చెబుతున్నారు. చైనా జవాన్లతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తితే తమ సైనికులు కాల్పులు జరిపేందుకు భారత్ అనుమతించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారత్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది''.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు అంగీకరించిన సమయంలో గ్లోబల్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది.

''సరిహద్దుల్లో మోహరింపులను పెంచబోమని రెండు దేశాల సైనిక కమాండర్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది. కానీ భారత్ తమ మాటలకు కట్టుబడి ఉండటంలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి''.

''తాజా పరిస్థితుల నడుమ భారత్‌ నుంచి ఎలాంటి సైనిక పరమైన చర్యలు కనిపించినా తిప్పికొట్టేందుకు చైనా అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. భవిష్యత్‌లో సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణం కాబోతున్నాయి''అంటూ సైనిక నిపుణులు చేసిన వ్యాఖ్యలను గ్లోబల్ టైమ్స్ ఉటంకించింది.